Hyderabad News: ఒవైసీ వాహనంపై కాల్పులు.. చార్మినార్‌ వద్ద పోలీసుల బందోబస్తు

మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై నిన్న ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ నగర

Updated : 04 Feb 2022 13:25 IST

హైదరాబాద్‌: మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై నిన్న ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి బందోబస్తు పెంచారు. చార్మినార్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై నిన్న దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా.. హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు