ఉద్వేగానికి గురిచేస్తోన్న స్మృతిజీ పోస్టు

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆమె చేసే పోస్టుల్లో ఎక్కువగా హాస్య చతురతకే స్థానం ఉంటుంది. 

Updated : 10 Dec 2020 15:22 IST

 
దిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆమె చేసే పోస్టుల్లో ఎక్కువగా హాస్య చతురతకే స్థానం ఉంటుంది. కానీ, తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసిన ఓ పోస్టు మాత్రం కాస్త ఉద్వేగానికి గురిచేస్తోంది. ‘మేరాఘర్’‌ హ్యాష్‌ట్యాగ్‌తో.. తాను చిన్నతనంలో ఉన్న ఇంటి జ్ఞాపకాలను ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. 

‘అద్దె ఇళ్లల్లో నివసించే వారు కొంత కాలం తరవాత అంతా సర్దుకొని, మరో ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంత భారంగా అనిపిస్తుందో తెలిసిందే. పిల్లలు వారి స్నేహితులను విడిచిపెట్టి, తమతో జ్ఞాపకాలను మోసుకెళ్తూ కన్నీరు పెట్టుకుంటారు. దిల్లీలోని 1246 ఆర్కేపురంలో నేను ఉన్న ఈ ఇల్లు నా మనసుకు చాలా దగ్గరైంది. నన్ను, నా జీవితాన్ని, నా రాతను తీర్చిదిద్దిన నా దాదు(తాత) ప్రాణాలు విడిచింది అక్కడే. టెర్రస్‌పై నాన్న నేర్పిన పాఠాల తాలూకు జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. అవి నాకు జీవిత పాఠాలు. మీకు అలాంటి మధుర స్మృతులు ఉంటే ‘మేరాఘర్’ హ్యాష్‌ట్యాగ్‌తో నాకు షేర్ చేయండి’ అని స్మృతి ఇరానీ ఉద్వేగభరింతంగా వివరించారు. అలాగే తన దాదుతో ఉన్న ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

ఇవీ చదవండి: 

నూతన పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపన

బరువు పెరిగితే..లంచం తీసుకున్నట్లే..!

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts