
మసాజ్ పరికరంలో రూ.కోటి విలువైన డ్రగ్స్!
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం, మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు దుండగులు వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎలక్ర్టిక్ మసాజ్ పరికరంలో అమర్చి వాటిని తరలిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ కొరియర్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా మసాజ్ పరికరంలో అమర్చిన ఎండీఎంఏ ట్యాబ్లెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఇవి 1980 గ్రాములు ఉంటాయని, వీటి విలువ రూ.కోటి ఉంటుందని చెప్పారు. ఆ పార్శిల్ బెల్జియం నుంచి రాగా వాటిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.