
ప్యాంట్‌లో పాము.. కదలకుండా 7 గంటలు!
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతడి జీన్స్ ప్యాంట్‌లోకి నాగుపాము దూరడంతో ఏడు గంటల పాటు కదలకుండా నిలుచున్నాడు. మీర్జాపూర్ పరిధిలోని ఓ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, తీగల ఏర్పాటు పనులు చేస్తున్నారు. పనులు నిర్వహించేదుకు వచ్చిన కార్మికులు స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో బస చేస్తున్నారు. అయితే అర్ధరాత్ని వేళ నిద్రిస్తున్న సమయంలో వచ్చిన ఓ తాచుపాము ఓ కార్మికుడి జీన్స్ ప్యాంట్‌లోకి దూరింది. మెలుకువ వచ్చి భయాందోళకు గురైన సదరు యువకుడు వెంటనే లేచి పక్కనే ఉన్న స్తంభాన్ని పట్టుకొని రాత్రంతా కదలకుండా నిలుచున్నాడు. తెల్లవారుజామున వచ్చిన పాములు పట్టేవారు అతడి ప్యాంటులోంచి చాకచక్యంగా సర్పాన్ని బయటకు తీయడంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సును అందుబాటులో ఉంచినట్లు స్థానికులు తెలిపారు. కార్మికుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.