శ్వేతవర్ణం దాల్చిన పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణులు

జమ్మూ కశ్మీర్‌ కొత్త అందాలను సంతరించుకుంటోంది. కొద్ది రోజులుగా జోరుగా మంచు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్నాయి....

Published : 01 Dec 2020 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌ కొత్త అందాలను సంతరించుకుంటోంది. కొద్ది రోజులుగా జోరుగా మంచు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్నాయి. పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణి ప్రాంతాలు మంచు ఖండాన్ని తలపిస్తున్నాయి. పూర్తిగా మంచుతో నిండిపోయిన పలు ప్రాంతాలు నూతన శోభతో ఆకట్టుకుంటున్నాయి. హిమాలయ శ్రేణిలో తక్కువ ఎత్తులో ఉండే పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులు అందాల లోకంగా మారాయి. హిమపాతం ధాటికి కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా ఏర్పడిన మంచు మేటలను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని