శ్రీశైలం 8 గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయం ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Published : 14 Sep 2020 15:02 IST

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయం ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 1,63,517 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో శ్రీశైలం స్పిల్‌వే ద్వారా 1,96,203 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తతం జలాశయంలో 884.9 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 215.32 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. దీని ద్వారా అదనంగా మరో 30,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని