సిల్కు మాస్కులతో మరింత మేలు.!

కరోనా కట్టడికి భౌతికదూరం పాటించటంతో పాటు మాస్కు ధరించటం కూడా అలవాటుగా మారిపోయింది. ఈ మహమ్మారి నివారణకు.. 

Published : 24 Sep 2020 19:01 IST

వాషింగ్టన్‌: కరోనా కట్టడికి భౌతికదూరం పాటించటంతో పాటు మాస్కు ధరించటం కూడా అలవాటుగా మారిపోయింది. ఈ మహమ్మారి నివారణకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సినాసిటి యూనివర్సిటీ టీకా వచ్చే వరకూ ప్రజలు తాము వాడే మాస్కులు ఎటువంటివైతే మరింత సురక్షితంగా ఉంటారు. ఏయే రసాయన ధర్మాలు ఉన్న మాస్కులు ధరిస్తే వైరస్‌ను కట్టడి చేయొచ్చే అనే విషయాలపై అధ్యయనం చేసింది. 

సిల్క్‌ వస్త్రంతో చేసిన మాస్కులు శ్వాస తీసుకోవడంతో పాటు, ధరించడానికి అనుకూలంగా ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఎన్‌95, సర్జికల్‌ మాస్కులతో పాటు సిల్క్‌తో చేసిన మాస్కులు సమర్థంగా వైరస్‌ను నిలువరించగలవని కనుగొన్నారు. ఈ మాస్కుల సమర్థతపై పలువురు వైద్యులను సంప్రదించి ప్రయోగాలు చేసిన వర్సిటీ సిల్క్‌ మాస్క్‌ పనితీరు అద్భుతంగా ఉంటుందని వివరించింది. వైరస్‌ను నిలువరించటం, శ్వాస తీసుకోవటం, తడి ఆరటం..తదితర ఉపయోగాలు సిల్క్‌ మాస్క్‌ల్లో ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది.

ఇటీవల కాలంలో రాగితో తయారైన వస్తువులకు డిమాండ్‌ పెరిగింది. బాక్టీరియా, వైరస్‌ను చంపగల శక్తి రాగికి ఉండటంతో రాగిపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ అధ్యయనంలో రాగికి సంబంధించిన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. సిల్క్‌ తయారీలో భాగంగా గొంగళి పురుగులకు మల్బరీ ఆకులను ఆహారంగా వేస్తారు. వాటిలో ఉండే రాగి మూలకం సిల్కు దారంతోనూ కలిసి ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ కారణంగా సిల్కుతో తయారయ్యే మాస్కులు సైతం కొంత మేర రాగి గుణాన్ని కలిగి ఉండి వైరస్‌ను కట్టడి చేస్తుందని అధ్యయనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని