అమరావతి భూముల విచారణ వాయిదా

ఏపీ రాజధాని అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను ..

Published : 06 Nov 2020 01:20 IST

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. సీఆర్డీయే ప్రాంతంలోని భూముల అంశంలో అవకతవకలు జరిగాయని కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. సబ్‌ కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే  హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్‌ దవే వాదించారు. గత ప్రభుత్వ అన్ని చర్యలపై దర్యాప్తు చేయాలని కమిటీని ఏర్పాటు చేశారా అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ప్రశ్నించారు.  అవకతవకలు జరిగాయని కమిటీ భావించిన అంశాలపైనే సిట్‌ ఏర్పాటు చేసినట్లు దుష్యంత్‌ దవే కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సహా సిట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిందా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని