ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖారారుపై తీర్పు రిజర్వ్‌

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌కు శిక్ష ఖారారుపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌ చేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శిక్ష ఖరారుపై ఇవాళ విచారణ ముగించింది. సుప్రీం కోర్టు జడ్జిలు, కోర్టులపై ప్రశాంత్‌భూషణ్‌ చేసిన ట్వీట్లను అత్యున్నత ధర్మాసనం సుమోటోగా...

Updated : 25 Aug 2020 16:21 IST

దిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌కు శిక్ష ఖారారుపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌ చేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శిక్ష ఖరారుపై ఇవాళ విచారణ ముగించింది. సుప్రీం కోర్టు జడ్జీలు, కోర్టులపై ప్రశాంత్‌భూషణ్‌ చేసిన ట్వీట్లను అత్యున్నత ధర్మాసనం సుమోటోగా తీసుకుంది. సద్విమర్శలో తప్పులేదు.. కానీ, ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పష్టం చేశారు. ఎవరినైనా బాధపెట్టినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పులేదన్నారు. క్షమాపణ పలు సందర్భాల్లో దివ్య ఔషధంగా పని చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. నిజాయతీతో కూడిన ప్రకటననే కోర్టుకు ఇచ్చారని ఆయన తరఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ న్యాయస్థానానికి వివరించారు.

సుప్రీం న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ప్రశాంత్‌భూషణ్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీనిపై క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై పునరాలోచన చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌కు ఈనెల 24వరకు గడువు ఇచ్చింది. తాను క్షమాపణ చెప్పేదిలేదని, సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉంటానని ప్రశాంత్‌ భూషణ్‌ భీష్మించుకు కూర్చున్నారు. తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని