కరోనా కాలర్‌ ట్యూన్‌ను ఎలా ఆపాలి?

రష్యా అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్థాన్‌ Vs ఇంగ్లండ్ టీ20 క్రికెట్‌ మ్యాచ్..వీటి గురించి భారతీయులు ఎక్కువగా గూగుల్‌ వెతికారట.

Published : 09 Sep 2020 01:13 IST

భారతీయుల ఆసక్తిని వెల్లడించిన గూగుల్ ఇండియా


 

దిల్లీ: రష్యా అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్థాన్‌ Vs ఇంగ్లండ్ టీ20 క్రికెట్‌ మ్యాచ్..వీటి గురించి భారతీయులు ఎక్కువగా గూగుల్‌ వెతికారట. ఆగస్టు నెలలో టాప్‌ ట్రెడింగ్‌లో ఉన్న అంశాలను  గూగుల్ ఇండియా తన నివేదికలో వెల్లడించడంతో భారతీయుల ఆసక్తి బయటపడింది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..‘స్పుత్నిక్’, ‘స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌’ గురించి వెతుకులాట వరుసగా 3,300 శాతం, 2,750 శాతం పెరిగిపోయింది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవం గురించి శోధన ఒక్కసారిగా 3,750 శాతం ఎగబాకింది. అలాగే గూగుల్‌లో అధికంగా వెతికిన 10 ప్రశ్నల జాబితాను విడుదల చేసింది.

అవేంటంటే..
* అమిత్‌ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందా?‌
* దుస్తులపై కరోనా ఎంతకాలం ఉంటుంది?
*రష్యా కరోనా వైరస్‌కు మందులు కనుగొందా?
*కరోనా కాలర్‌ ట్యూన్‌ను ఎలా ఆపాలి?
*భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు విడుదల చేస్తారు?
*ఒళ్లు నొప్పులు కరోనాకు సూచనా?
*కరోనాలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
*ఎన్ని రోజుల తరవాత కరోనా లక్షణాలు బయటపడతాయి?
*ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందా?
*ఎస్పీబీకి కరోనా ఎలా సోకింది?
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని