‘రథం దగ్ధంపై జగన్ స్పందించాలి’
హిందువులకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సీఎం జగన్ స్పందించాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే అరెస్ట్ చేస్తారా?
అమరావతి: హిందువులకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సీఎం జగన్ స్పందించాలని స్వామి పరిపూర్ణానంద కోరారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే అరెస్ట్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘జనం నమ్మి ఓట్లేశారు.. వారికి న్యాయం చేయాలి కదా?ఆలయాలపై దాడి చేస్తే ఉన్మాది చేశాడని చెబుతున్నారు. రథం దగ్ధం వెనుక కుట్ర ఉంది. దగ్ధం చేసిన వాళ్ల నుంచే డబ్బు వసూలు చేయాలి. హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి’’ అని పరిపూర్ణానంద ఆరోపించారు.
పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు:ఐవైఆర్
అంతర్వేదిలో జరిగింది చిన్న విషయమో లేక ప్రమాదవశాత్తూ జరిగిందో కాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆలయాలపై వరుస ఘటనల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. పథకం ప్రకారం హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ఓ మత ప్రచార వ్యాప్తిలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని ఐవైఆర్ ఆరోపించారు. హైందవ మత విశ్వాసాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి ఘటనలను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..