
TS News: వీవీ ప్యాట్ తరలింపుపై పుకార్లు నమ్మొద్దు: ఆర్వో రవీందర్‌రెడ్డి
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వీవీ ప్యాట్ తరలింపు విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) రవీందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రకటనలో వెల్లడించారు. పనిచేయని వీవీప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో అన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్ పని చేయలేదని దాని స్థానంలో మరో దానితో పోలింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని నవంబర్ 2వ తేదీ జరగనున్న లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.