HYD: హైదరాబాద్ సీపీకి లీగల్ నోటీసు
మాదకద్రవ్యాలు, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్ చాట్లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ నగరానికి చెందిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మాదకద్రవ్యాలు, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్ చాట్లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ నగరానికి చెందిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు లీగల్ నోటీసులు పంపారు. వెస్ట్‌జోన్ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా కె.శ్రీనివాస్ నోటీసులు పంపారు. ‘అక్టోబరు 27న మంగళ్‌హాట్, ధూల్‌పేట్, జుమేరాత్‌బజార్ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు తక్షణమే గుర్తించాలని నోటీసులో కోరారు. పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్ల వంటి సాధారణ పౌరులను ఆపడానికి, మొబైల్ ఫోన్లను తెరవమని అభ్యర్థించడానికి పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని తెలిపారు. సహేతుకమైన కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు