దోస్త్‌ మొదటి దశ సీట్ల కేటాయింపు

దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి కేటాయించింది. రాష్ట్రంలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. 1,71,275 మంది విద్యార్థులు ...

Published : 21 Sep 2020 16:02 IST

హైదరాబాద్‌: దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి కేటాయించింది. రాష్ట్రంలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. 1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 వరకు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాత రెండో విడతలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చన్నారు. నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని