ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌...

Published : 13 Nov 2020 20:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఈనెల 19 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈనెల 20, 21 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈనెల 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 24 నుంచి తొలి విడత బీఫార్మసీ, ఫార్మ్‌ డీ సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 24 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో బోధనా రుసుము చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. 

డిసెంబరు 1న చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తుదివిడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుక్‌ చేసుకోవాలి. డిసెంబర్‌ 2న ధ్రువపత్రాల పరిశీలన, డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తిచేసి డిసెంబరు 5న తుది విడత సీట్లను కేటాయిస్తారు. తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబరు 5 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్ల స్పాట్ అడ్మిషన్ల కోసం డిసెంబరు 5న మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని