ఆ హామీలన్నీ లిఖితపూర్వకంగా ఇవ్వండి:హైకోర్టు

ధరణిలో ఆస్తుల వివరాల నమోదు అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌, పీటీఐఎన్‌ కోసం ఆధార్‌ వివరాలు అడుగుతున్నారంటూ

Published : 17 Dec 2020 00:57 IST

హైదరాబాద్‌: ధరణిలో ఆస్తుల వివరాల నమోదు అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌, పీటీఐఎన్‌ కోసం ఆధార్‌ వివరాలు అడుగుతున్నారంటూ పిటిషనర్లు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానానికి గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆధార్‌ వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్ ఇచ్చిన హామీని గుర్తు చేసింది. పిటిషనర్ల అభ్యంతరం నేపథ్యంలో ఆ హామీలన్నీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ధరణితో పాటు రిజిస్ట్రేషన్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిందని.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని