సిలబస్‌ కుదించిన ఇంటర్‌ బోర్డు

కరోనా పరిస్థితులు, తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌...

Published : 22 Sep 2020 20:15 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితులు, తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కుదించిన సిలబస్‌ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని స్పష్టం చేశారు. 

సైన్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ తొలగించిన పాఠాలనుకుదించినట్లు జలీల్‌ చెప్పారు. హ్యుమానిటీస్‌, లాంగ్వేజెస్‌లో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 30 శాతం కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం తెలుగు సిలబస్‌ను సవరించామని.. రెండో సంవత్సరం హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌ సిలబస్‌లో మార్పులు చేసినట్లు జలీల్‌ వివరించారు. కుదించిన సిలబస్‌ ఈ ఏడాదికే పరిమితం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని