పారదర్శకంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఎస్‌ఈసీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారుల నియామకం పూర్తయిందని

Published : 13 Nov 2020 01:31 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారుల నియామకం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ఈసీ) పార్థసారథి తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుందని.. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని ఎస్‌ఈసీ సూచించారు. నేతలు సంయమనం పాటిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలన్నారు. 

పోటీ చేసే అభ్యర్థులు జీహెచ్‌ఎంసీలో ఓటరుగా నమోదై ఉండాలని.. 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లే కొనసాగుతాయని పార్థసారథి స్పష్టం చేశారు. అన్ని అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సీనియర్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమిస్తామన్నారు. వార్డులో నివసించే ఓటర్లందర్నీ ఆ వార్డులోనే చేర్చాలని.. ఒక వార్డు ఓటరు ఇంకో వార్డులో ఉండరాదని చెప్పారు. ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా కచ్చితంగా నిర్ధారించుకోవాన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని