
Updated : 19 Sep 2020 20:00 IST
డిక్లరేషన్ వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్ వివరణ
తిరుమల: శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్ రూల్ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
Tags :