చికెన్‌ పేరు విని కోమా నుంచి బయటకు..

కోమాలోకి వెళితే దాని నుంచి సాధారణ స్థితికి రావడానికి రోజులు పట్టొచ్చు.. నెలలు, సంవత్సరాలూ పట్టే ఆస్కారం ఉంది. కోమాలోకి వెళ్లడానికి గల కారణం, దాని తీవ్రత.. అందే వైద్య సేవలను బట్టి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే తైవాన్‌కు చెందిన టీనేజర్‌ చికెన్‌ పేరు విని కోమా నుంచి బయటికి వచ్చిన ఆశ్చర్యపరిచే

Updated : 11 Nov 2020 04:49 IST

తైవాన్‌ : కోమాలోకి వెళితే దాని నుంచి సాధారణ స్థితికి రావడానికి రోజులు పట్టొచ్చు.. నెలలు, సంవత్సరాలూ పట్టే ఆస్కారం ఉంది. కోమాలోకి వెళ్లడానికి గల కారణం, దాని తీవ్రత.. అందే వైద్య సేవలను బట్టి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే తైవాన్‌కు చెందిన ఓ టీనేజర్‌ చికెన్‌ పేరు విని కోమా నుంచి బయటికి వచ్చిన ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. ఆ దేశంలోని సించూ కౌంటీకి చెందిన ఓ టీనేజర్‌ ‌ రెండు నెలల కిందట స్కూటీపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. కాలేయం, కిడ్నీలతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినడంతో అత్యవసర శస్ర్తచికిత్సలు చేశారు. ఈ క్రమంలో అతను కోమాలోకి వెళ్లాడు. 

అయితే అతను మనోధైర్యంతో కోమా నుంచి బయట పడితేనే సాధారణ జీవితం గడపగలడని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి అతడు‌ కోమా నుంచి బయటికి రావాలని వాళ్ల కుటుంబం ప్రార్థనలు చేస్తూనే ఉంది. రెండు నెలల పాటు అతని ఆరోగ్యస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో 62వ రోజు అతడి‌ సోదరుడు పక్క బెడమీద కూర్చొని తాను చికెన్‌ ఫిల్లెట్‌ తినడానికి వెళ్తున్నా అని చెప్పాడు. ఇది అతడికి ఇష్టమైన ఫుడ్‌ కావడంతో ఉన్నట్టుంటి అతని పల్స్ రేట్‌లో మార్పులొచ్చాయి. అది క్రమంగా పెరిగి స్పృహలోకి వచ్చాడు. దీంతో వైద్యులతో పాటు అతని కుటుంబం సైతం సంతోషించింది. ఆ తర్వాత అస్వస్థత నుంచి కోలుకున్న టీనేజర్‌ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. తనకు చికిత్స అందించిన వైద్య బృందానికి పెద్ద కేకుతో ధన్యవాదాలు కూడా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని