తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన

వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది.

Published : 16 Dec 2020 02:10 IST

చెన్నై: వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఈ వర్షాలు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  ఎక్కువ ప్రభావం చూపుతాయని వెల్లడించారు. ఈ మేరకు వాతావరణశాఖ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 16 నుంచి 18 డిసెంబరు మధ్య, కేరళ, లక్షద్వీప్‌లలో 17 నుంచి 18 డిసెంబరు మధ్య ఈ భారీ వర్షాలు పడతాయన్నారు. డిసెంబరు నెల ప్రారంభంలో వారం రోజుల తేడాతో వచ్చిన నివర్‌, బురేవి తుపాన్ల నుంచి కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మళ్లీ వర్షాలు హడలెత్తించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని