ఉల్లి నిల్వలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు

రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది.

Updated : 10 Dec 2020 12:33 IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. హోల్‌సేల్‌ వ్యాపారులు 250 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారులు 20 క్వింటాళ్ల వరకు ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే వ్యాపారులకు మినహాయింపు ఇచ్చింది. అందుకు అనుగుణంగా గతంలో జారీ చేసిన ఉల్లి వ్యాపారుల అనుమతులు, నిల్వ, నియంత్రణ ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణ చేస్తూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని