వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో రూ.106.15కోట్లు..

తెలంగాణలో ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరణి పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ రిజిస్ట్రేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 2 నుంచి..

Published : 21 Dec 2020 01:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ధరణి పోర్టల్‌ ద్వారా నిర్వహించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.106.15 కోట్లు ఆదాయం సమకూరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరణి పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ రిజిస్ట్రేషన్ల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 2 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 89,851 లావాదేవీలు జరగగా.. 66,614 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 1.35 కోట్ల మంది ధరణి పోర్టల్‌ వెబ్‌సైట్‌ని సందర్శించినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

ఇవీ చదవండి..

‘విశాఖ భూములపై సిట్‌ నివేదిక సిద్ధం’

తెరాస మహిళా కార్యకర్త ఇంట్లో చొరబడి దాడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని