హైదరాబాద్‌లో వారంలో 700 మి.మీ వర్షపాతం

నగరంలో ఏటా సగటున 800 మి.మీల వర్షపాతం నమోదవుతుందని.. ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీల వర్షపాతం నమోదైందని సాగునీటి  ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ తెలిపారు. జంట నగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలసౌధలో ఆ శాఖ కమిషనర్‌, అధికారులతో..

Updated : 21 Oct 2020 16:58 IST

తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్

హైదరాబాద్‌: నగరంలో ఏటా సగటున 800 మి.మీల వర్షపాతం నమోదవుతుందని.. ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీల వర్షపాతం నమోదైందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ తెలిపారు. జంట నగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలసౌధలో ఆ శాఖ కమిషనర్‌, అధికారులతో రజత్‌ కుమార్ సమీక్ష నిర్వహించారు. చెరువులకు గండ్లు పడకుండా అధికారులను అప్రమత్తం చేసే విషయంపై ప్రధానంగా చర్చించారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బృందాలు చెరువులను పరిశీలించిన అనంతరం మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. నగరంలో 53 చెరువులు దెబ్బతిన్నాయని.. త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు. చెరువుల కబ్జాపై చర్యలు తీసుకుంటామని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని