అడవి నుంచి తప్పించుకొని గుడిలోకి దూరిన గజం..

తమిళనాడులో అడవి నుంచి తప్పించుకొని వచ్చిన గజరాజు ఓ మందిరంలోకి ప్రవేశించి..

Updated : 10 Oct 2021 15:13 IST

తమిళనాడులో అడవి నుంచి తప్పించుకొని వచ్చిన గజరాజు ఓ మందిరంలోకి ప్రవేశించి.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఈరోడ్‌ జిల్లాలో ఉన్న బన్నారి అమ్మన్‌ మందిరంలోకి ఓ అడవి ఏనుగు చొరబడింది. సమీపంలో ఉన్న సత్యమంగళం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి ఈ గజరాజు వచ్చినట్లు తెలుస్తోంది. మందిరం పరిసరాల్లో తిరిగిన ఏనుగు.. అక్కడి ద్విచక్ర వాహనాన్ని, ఓ తోపుడు బండిని ధ్వంసం చేసింది. భయాందోళనకు గురైన స్థానికులు.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న అధికారులు.. ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. అరగంట పాటు శ్రమించిన అనంతరం అడవిలోకి పంపించారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని