AP news: పులివెందులలో ఆగ్రో ఎకోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌

కడప జిల్లా పులివెందులలో జర్మనీ సహకారంతో ఆగ్రో ఎకోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు.

Published : 22 Sep 2021 22:40 IST

అమరావతి: కడప జిల్లా పులివెందులలో జర్మనీ సహకారంతో ఆగ్రో ఎకోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో మరింత లోతైన పరిశోధన, సిబ్బందికి సాంకేతిక శిక్షణ కోసం ఈ పరిశోధనాకేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. రీసెర్చ్‌ సెంటర్ ఏర్పాటు కోసం జర్మనీ రూ.170కోట్ల గ్రాంట్‌ను అందించనుందని మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ పరిశోధన, శిక్షణా కేంద్రం పనిచేయనుందని మంత్రి కన్నబాబు వివరించారు. జర్మనీకి చెందిన కెడబ్ల్యూఎఫ్‌ బ్యాంకు ప్రతినిధులు మంత్రితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని