Cow Calfs in the Car: కారులో ఆవు దూడలు.. 

జీవాలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శునకం, పిల్లిని తప్ప ఇతర జంతువులను కారులో షికారుకు తీసుకెళ్లలేం.

Published : 29 Aug 2021 15:39 IST

జీవాలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శునకం, పిల్లిని తప్ప ఇతర జంతువులను కారులో షికారుకు తీసుకెళ్లలేం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మూడు ఆవు దూడలను కారులో తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అమెరికాలోని విస్కాన్సిన్‌లో నివసించే జెస్సికా నెల్సన్‌ అనే మహిళ కారులో వెళుతుండగా మెక్‌డొనాల్డ్స్‌ ఎదురుగా నిలిపి ఉంచిన కారులో ఓ ఆవు ఉండటాన్ని గమనించింది. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. మొదట కారులో ఆవును చూసి నమ్మలేకపోయనని నెల్సన్‌ తెలిపింది. ఈ వీడియోను చూసిన ఆవు యజమాని తనను సంప్రదించినట్లు ఆ మహిళ అసోసియేటెడ్‌ ప్రెస్‌కి తెలిపింది. బయటకు కనిపించింది చిన్న దూడేనని.. వెనుక సీట్లో మరో రెండు దూడలు పడుకుని ఉన్నాయని.. వీటిని అప్పుడే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు ఆవు యజమాని వివరించారని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు