Updated : 09/10/2021 13:53 IST

Hyderabad : థియేటర్‌ గోడ కూలి.. 50 బైక్‌లు ధ్వంసం

హైదరాబాద్‌ : నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతం అతలాకుతులమైంది. ఆ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్‌ శివ గంగను వరద పోటెత్తింది. భారీ వర్షానికి థియేటర్‌ ప్రహరీ కూలింది. దీంతో అక్కడే పార్కు చేసిన సుమారు 50 ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఫస్ట్‌ షో సినిమా చూసి బయటకి వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ప్రేక్షకులు భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు థియేటర్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. హాల్‌లోని కుర్చీలు నీట మునిగాయి.

ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టం గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. జేసీబీతో గోడ శిథిలాలను తొలగించి వాహనాలను బయటకి తీశారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని