Golden stone: ఆకాశం నుంచి జారిపడ్డ ‘స్వర్ణశిల’

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది.

Updated : 27 Sep 2021 15:13 IST

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది. వెంటనే తహసీల్దార్‌ నర్సింగ్‌ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత.. ఈ రాయిని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులకు పంపించారు. రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా అభివర్ణిస్తున్నారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని