చోరీ చేసి.. క్షమించమని లేఖ!

సూపర్‌మార్కెట్‌లో చోరీ చేసిన వ్యక్తి తనను క్షమించాలని వేడుకుంటూ సూపర్‌మార్కెట్‌ యజమానికి లేఖ రాసిన ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 12 Oct 2020 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌మార్కెట్‌లో చోరీ చేసిన వ్యక్తి తనను క్షమించాలని వేడుకుంటూ సూపర్‌మార్కెట్‌ యజమానికి లేఖ రాసిన ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటు చేసుకుంది. మధురైలోని వుసలంపట్టి ప్రాంతంలో రాంప్రకాశ్‌ అనే వ్యక్తి నడుపుతున్న సూపర్‌ మార్కెట్‌లో దొంగతనం జరిగింది. రూ.65వేల విలువ గల కంప్యూటర్లు, ఒక టీవీ, రూ.5వేల నగదు మాయమయ్యాయి. దొంగతనం చేసిన వ్యక్తి తనను క్షమించమంటూ యజమానికి లేఖ రాసి వదిలి వెళ్లాడు. ‘చాలా ఆకలి వేస్తోంది. ఈ దొంగతనం వల్ల మీరు మీ ఒక్క రోజు సంపద నష్టపోతారు. కానీ అది నా 3నెలల ఆదాయానికి సమానం, క్షమించాలి’ అని లేఖలో వేడుకున్నాడు.  ఈ విషయంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ద్వారా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు