నీలి రంగు పాము.. నెట్టింట్లో వైరల్‌

అరుదైన కొన్ని జీవులు వాటి రంగు, పరిమాణాలతో ఇట్టే..

Published : 18 Sep 2020 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరుదైన కొన్ని జీవులు వాటి రంగు, పరిమాణాలతో ఇట్టే ఆకర్షిస్తుంటాయి. అలాంటి కోవకి చెందిందే ‘బ్లూ పిట్ వైపర్‌’ అనే బుల్లి పాము. నీలి వర్ణంలో మెరిసిపోతూ ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. గులాబీ పువ్వు చుట్టూ అల్లుకుపోయిన ఈ చిన్ని పాము వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన అనేకమంది నెటిజన్లు పాము భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

జంతువుల వీడియోలు, ఫొటోలు షేర్‌ చేసే ‘లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌’ ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకోగా 50 వేలకు పైగా లైకులు సాధించింది. అంత ఆకర్షణీయంగా కనిపించినా బ్లూ పిట్ వైపర్‌ ఓ విషపూరితమైన సరీసృపం. ఈ పాములు ఇండోనేసియా, తూర్పు తైమూర్‌ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని మాస్కో జూ అధికారులు వెల్లడించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని