విభిన్నం..ఈ క్రిస్మస్‌ చెట్టు

 క్రిస్మస్...ఈ పేరు వినగానే ఓ రకమైన ఆనందం, ఉల్లాసం, భక్తి. ఇలా అన్నీ కలగలిసిన పండుగ. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్గొచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంతా క్లాజ్.. క్రైస్తవులు క్రిస్మస్ చెట్టును దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే ఏటా తమ ఇళ్లల్లో క్రిస్మస్‌ చెట్టును పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే..

Published : 23 Dec 2020 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  క్రిస్మస్... ఈ పేరు వినగానే ఓ రకమైన ఆనందం, ఉల్లాసం, భక్తి కలుగుతాయి. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంతాక్లాజ్. అయితే..  అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ కుటుంబం 60 ఏళ్లుగా మంచుతో క్రిస్మస్‌ చెట్టును తయారు చేసి వేడుకలు జరుపుకుంటోంది. దీనికి వీల్‌ ఐస్‌ ట్రీ అని పేరు. 1961లో  మాబెల్‌, వియర్ల్‌ వీల్‌ అనే ఇద్దరు వ్యక్తులు మొట్టమొదటి ఐస్‌ క్రిస్మస్‌ చెట్టును తయారు చేశారు. అప్పటి నుంచి వీల్‌ కుటుంబం దీన్ని తయారు చేయడం ఆనవాయితీగా పెట్టుకుంది.

వాస్తవానికి ఇది చెట్టు కాదు. చెక్క ఫ్రేమ్‌తో చేసిన మంచు శిల్పం. పశ్చిమ దేశాల్లో చలికాలం మంచు వల్ల చెట్లన్నీ జీవం కోల్పోతాయి. అలాంటి చెట్లతో వీల్‌ కుటుంబం ఒక ఫ్రేమ్‌ను తయారు చేసింది. దానికి నీటి గొట్టాలను అమర్చి, రాత్రి వేళ మైనస్‌ 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో గొట్టాల ద్వారా నీటిని వదులుతారు. దీంతో నీరు గడ్డకట్టి మంచు శిల్పంగా మారుతుంది. వివిధ రంగులను నీటిలో కలిపి ఆ ఐస్‌ ట్రీ మీద చల్లుతారు. అప్పుడు విభిన్నరంగుల్లో మెరిసిపోతుంది. అయితే.. పర్యాటకులు మాత్రం మంచు కింద నిజమైన చెట్టు ఉందా ఆశ్చర్యపోతుంటారు. ఏటా వేర్వేరు రూపాల్లో ఈ ఐస్‌ ట్రీని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మారింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని