అర్ధరాత్రి ఎలుగుబంట్ల తనిఖీ.. ఎక్కడో తెలుసా..!

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరిగేవి. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్‌ ప్రాంతంలో గల ఓ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మూడు ఎలుగుబంట్లు ఎలాంటి అదురుబెదురు

Updated : 30 Dec 2020 10:01 IST

రాయ్‌పూర్‌: లాక్‌డౌన్లో‌  ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరిగేవి. తాజాగా.. చత్తీస్‌గఢ్‌లోని కాంకర్‌ ప్రాంతంలో గల ఓ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మూడు ఎలుగుబంట్లు ఎలాంటి అదురుబెదురు లేకుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్లాయి. ఈ వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిని అక్కడి ఐపీఎస్‌ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. పైగా, పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో అర్ధరాత్రి ఎలుగుబంట్ల ఆకస్మిక తనిఖీ అని ఆయన చమత్కరించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను ఆయన ప్రశంసించారు.

ఇది సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన క్షణాల్లోనే వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. చాలా అందమైన వీడియోను పోస్టు చేసిన ఐపీఎస్‌ అధికారికి ధన్యవాదాలు అంటూ కొందరు.. తనిఖీ ఆశాజనకంగా జరిగిందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా..  ఈ సంవత్సరం ప్రారంభంలో చత్తీస్‌గఢ్‌‌లోని ఓ ఆలయ సమీపంలో ఎలుగుబంట్లు సంచరించిన మరో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

నీటికొచ్చిన చిరుత.. వేటాడిన మొసలి

తాబేళ్ల సునామి ఎప్పుడైనా చూశారా!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని