ఈసారి మాడవీధుల్లోనే శ్రీవారి వాహనసేవలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

Published : 02 Oct 2020 00:51 IST

 

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను మాడవీధుల్లో నిర్వహించాలని.. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించాలని నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహించనున్నారు. ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద పుష్పప్రదర్శన, ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని సమీక్షలో అధికారులు నిర్ణయించారు. 

ఇటీవల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వాహన సేవలను కల్యాణ మండపానికే పరిమితం చేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలను మాడవీధుల్లో నిర్వహించాలని నిర్ణయించడంతో పరిమిత సంఖ్యలో భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని