IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు

నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

Published : 07 Nov 2020 22:53 IST

 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద మహంకాళి ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తూ వర్చువల్ రన్‌ నిర్వహించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకూ ఈ పరుగు సాగింది.

ప్రభుత్వం ప్రకటించిన వరదసాయం అర్హులకు అందలేదని పేర్కొంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి జోనల్‌ కమిషనర్‌ మమతకు బాధితుల తరపున వినతిపత్రాలు అందజేశారు.

విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు.

తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాకినాడ నగరంలోని దమ్ములపేటలో నిర్మించిన గృహాల వద్ద లబ్ధిదారులతో కలిసి ఆయన ధర్నా చేశారు.

కాకినాడలో ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఆర్డీ వాణిశ్రీ


నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని