IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆంజనేయ స్వామి లే అవుట్‌లో ‘నా ఇల్లు నా సొంతం’ పేరుతో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాలవ

Published : 09 Nov 2020 23:47 IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆంజనేయస్వామి లే అవుట్‌లో తెదేపా ఆధ్వర్యంలో ‘నా ఇల్లు నా సొంతం’ పేరుతో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో కేంద్రబృందం పర్యటించింది. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులకు తెలియజేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో వామపక్షాలు చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. పోలీసు బలగాలు ఆందోళనకారులను కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. దీంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం కృష్ణా జిల్లాలో పర్యటించింది. నష్ట తీవ్రతను తెలియజేసేలా విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందసభ్యులు సౌరవ్‌రాయ్‌, ఆయుష్‌ పునీయ, శ్రావణ్‌కుమార్‌లు సందర్శించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ పంటనష్టం గురించి వారికి వివరించారు. 

హైదరాబాద్‌లో వరద బాధితులందరికీ తక్షణమే రూ.10వేల సాయం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేపట్టింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి బాధితులతో కలసి ర్యాలీగా వెళ్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ అఖిల భారత రైతు పోరాటాల సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేసీసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వేములపల్లి వెంకట రామయ్య, కిరణ్‌కుమార్‌, కె.రవి, టి.సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మీ సేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న మీసేవ నిర్వాహకులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని