IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అధ్వర్యంలో వెటర్నరి కాలేజి గ్రౌండ్‌లో వీఐపీ, వీవీఐపీల వాహనశ్రేణుల శిక్షణా కార్యక్రమం జరిగింది.ఎన్‌ఎస్‌జీ, ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ వింగ్ అధికారులు డీఎస్పీ డి కోటేశ్వరరావు,

Published : 10 Nov 2020 23:58 IST

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి అధ్వర్యంలో వెటర్నరి కాలేజీ గ్రౌండ్‌లో వీఐపీ, వీవీఐపీల వాహనశ్రేణుల శిక్షణా కార్యక్రమం జరిగింది. వాహనాలను నడిపే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు డ్రైవర్లకు వివరించారు. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఏఆర్‌ డీఎస్పీ నంద కిషోర్, హోంగార్డ్ డీఎస్పీ లక్ష్మణ్ కుమార్, ఎంటీవో ఆర్‌ఐ రెడ్డప్ప రెడ్డి, డీఎస్పీ డి. కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ రాజు, ఎస్సై జానకిరాం, ఎన్‌ఎస్‌జీ, ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ వింగ్ అధికారులు పాల్గొన్నారు.

కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ మీటర్లు అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ, పాల్గొన్నారు. బళ్లారి హైవే నుంచి కలెక్టరేట్‌ వరకూ ఈ ర్యాలీ సాగింది.


రాష్ట్ర అటవీ అమరుల దినోత్సవాన్ని గుంటూరులోని అరణ్యభవన్‌లో ఘనంగా నిర్వహించారు. విలువైన వృక్షసంపదను కాపాడుతూ అసువులు బాసిన అటవీ ఉద్యోగులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌ ప్రతీప్‌కుమార్‌లు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక ప్రతిభావంతులకు సదరం పరీక్షలు నిర్వహించారు. అర్హులైన వారికి వైద్యులు ధ్రువపత్రాలు జారీ చేశారు.

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పంట నష్టం తీరును కేంద్ర బృందానికి వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని