ఏడాదికి 250 రోజులు విమానంలోనే ప్రయాణం!
(Photo: ua1flyer insta)
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది పేదవారి కోరిక. మధ్యతరగతివాళ్లు ఒక్కసారి విమానమెక్కి జీవితాంతం గొప్పగా చెప్పుకుంటారు. ఇక సంపన్నులు, వ్యాపారవేత్తలు, సినీ తారలైతే పనుల నిమిత్తం, విహార యాత్రలంటూ తరచూ విమానాల్లో విదేశాలకు వెళ్తూ ఉంటారు. సామాన్యుడి జీవితంలో బస్సు ప్రయాణం ఎంత సాధారణమో.. వారికి విమాన ప్రయాణాలు అంత సాధారణం. వారంతా వారానికి, పదిరోజులకు ఒకసారి విమాన ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో 250 రోజులు విమానంలోనే ప్రయాణిస్తున్నాడు. అవాక్కయ్యారా!?మీరు చదివింది నిజమే. ఇటీవల విమాన ప్రయాణంలో ఓ రికార్డు కూడా సాధించాడు.
65ఏళ్ల టామ్ స్టకర్ ఓ బిజినెస్‌మ్యాన్. ఆటోమోటివ్ రంగంలో పలు వ్యాపారాలు ఉన్నాయి. కార్ల డీలర్లకు శిక్షణ ఇస్తుంటాడు. ఒక ఛానల్‌లో కార్యక్రమం నిర్వహిస్తాడు. తన విధుల్లో భాగంగా యూఎస్, యూరప్, ఆసియాలోని అనేక దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లోని తన సంస్థ కార్యాలయాలకు, ఇతర శిక్షణ శిబిరాలకు విమానాల్లో వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఎక్కడా ఒకటిరెండ్రోజులకు మించి ఉండడు. ఒక దేశంలో తన పని పూర్తి కాగానే.. వెంటనే విమానమెక్కి మరో దేశానికి పయనమవుతూ ఇప్పటి వరకు వేల సంఖ్యలో విమాన ప్రయాణాలు చేశాడు. ఏడాదిలో 200-250 రోజులు విమానంలోనే ప్రయాణం చేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. వృత్తిలో భాగమైన విమాన ప్రయాణాన్ని టామ్ బాగా ఆస్వాదిస్తాడు. అందుకే విధుల నుంచి రిటైర్ అయినా ప్రయాణాలు మాత్రం ఆపట్లేదు. ఎక్కువగా అతడు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లోనే ప్రయాణిస్తుండటంతో అక్కడి సిబ్బందికి, ప్రయాణికులకు టామ్ సుపరిచితుడే. అలా అతను ప్రపంచంలోనే తరచూ విమాన ప్రయాణం చేసే వ్యక్తిగానూ నిలిచాడు. విమాన ప్రయాణాల్లో గతేడాది 21 మిలియన్ మైళ్ల(దాదాపు 3.37కోట్ల కిలోమీటర్లు)ప్రయాణ మైలు రాయిని చేరుకొని రికార్డు సాధించాడు. ఈ విమాన ప్రయాణాల్లో టామ్ ఒక్కో మైలు రాయిని చేరుకున్నప్పుడల్లా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ వేడుకలు నిర్వహించడం విశేషం.
(Photo: United Airlines Twitter)
గత మార్చిలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి న్యూజెర్సీలోని న్యూఆర్క్‌కు ప్రయాణించాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి ఆయన విహారానికి బ్రేక్ వేసింది. కరోనా వల్ల విమాన సేవలు నిలిచిపోవడంతో 45 ఏళ్లలో తొలిసారి విమానంలో కాకుండా ఎక్కువ రోజులు భూమి మీద ఉన్నాడు. 45 రోజులపాటు న్యూజెర్సీలో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కూడా విమానాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. అయితే, ఈ మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో గత నెలలో న్యూఆర్క్ విమానాశ్రయం నుంచి లాస్ ఏంజిల్స్ విమానాశ్రయానికి ప్రయాణించి 22 మిలియన్ మైళ్ల(దాదాపు 3.54కోట్ల కి.మీ) మైలురాయిని చేరుకున్నాడు. తన విమాన ప్రయాణాలకు సంబంధించిన విశేషాలను టామ్ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకుంటాడు. ఇటీవల తను సాధించిన ఘనతను వెల్లడిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆయనకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘మరిన్ని రికార్డులు సాధించేలా మీ ప్రయాణాన్ని కొనసాగించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్‌లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
-
Sports News
Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
-
Viral-videos News
Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
-
General News
Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!