విశాఖ మన్యం.. భూతల స్వర్గం!

పుస్తకాలు, పెద్దల అతిశయోక్తిలో భూతల స్వర్గం అన్న మాట విన్నప్పుడు అదెలా ఉంటుంది.. అక్కడ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలనే కోరిక పుట్టడం సహజం. మరి ప్రత్యక్షంగా చూడాలంటే.. శీతాకాలం వెళ్లిపోయేలోపే బ్యాగు సర్దుకొని విశాఖ మన్యానికి బయలుదేరాల్సిందే...

Published : 14 Dec 2020 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పుస్తకాలు, పెద్దల అతిశయోక్తిలో భూతల స్వర్గం అన్న మాట విన్నప్పుడు అదెలా ఉంటుంది? అక్కడ ఏమేం ఉంటాయో తెలుసుకోవాలనే కోరిక పుట్టడం సహజం. మరి ప్రత్యక్షంగా చూడాలంటే.. శీతాకాలం వెళ్లిపోయేలోపే బ్యాగు సర్దుకొని విశాఖ మన్యానికి బయలుదేరాల్సిందే. కొండల మధ్య తేలియాడే మేఘాలు, లోయల అందాలు చూసి అదే మార్గంలో ఉన్న లంబసింగిలో టెంట్లు వేసుకొని కాసేపు మంచునే దుప్పటిగా కప్పుకొని, మన్యంలో పండించే తేయాకు కాఫీ తాగితే భూతల స్వర్గం నిర్వచనాన్ని స్వయంగా అనుభూతి చెందొచ్చు. 

ఘాట్‌ రోడ్ వెంబడి అటవీ అందాలు, పక్షుల కిలకిల రాగాలు, జంతువుల పలకరింపులు వింటూ పాడేరుకు చేరుకున్న పర్యాటకులు.. అక్కడి నుంచి 15కి.మీ దూరంలోని వంజంగి కొండల మధ్య ఉన్న అద్భుత ప్రపంచాన్ని చూసేందుకు పరుగులు తీస్తున్నారు.  ముందు రోజు రాత్రి కొండలకు సమీపంలో టెంటు వేసుకొని చలి మంటలు వేసుకుంటున్నారు. వేకువ జామునే లేచి మూడు కిలో మీటర్లు  ట్రెక్కింగ్‌ చేసి సూర్యుడు రాకముందే కొండల పైకి చేరుకుంటున్నారు. కనిపించే మేఘ సముద్రంలో నుంచి సూర్యుడు బంతిలా పైకి వచ్చే దృశ్యం చూస్తే వచ్చే కిక్‌ను తనివితీరా ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాలను చూసి తీరాల్సిందే అంటున్నారు.

కార్తిక మాసం ఆదివారం కావటం వల్ల విశాఖ మన్యానికి పర్యాటకులు పోటెత్తారు. ప్రధాన పర్యాటక ప్రాంతమైన లంబసింగి సహా పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపించింది. బస చేసిన ప్రాంతాల వద్ద పర్యాటకులు చలి మంటలు వేసుకొని కుటుంబాలతో సంతోషంగా గడిపారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. స్థానిక ప్రత్యేక వంటకాలు తింటూ పర్యాటక ఆనందాన్ని ఆస్వాదించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని