తెలంగాణ ఈసెట్‌ ప్రాథమిక కీ విడుదల

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈ సెట్‌-2020 ప్రాథమిక కీ విడుదల చేశారు.

Published : 05 Sep 2020 01:41 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈ సెట్‌-2020 ప్రాథమిక కీ విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల్లోగా తెలపాలని కన్వీనర్‌ సూచించారు. అభ్యంతరాలను ఆన్‌లోనే పంపించాలని విద్యార్థులకు తెలియజేశారు. గత నెల 31న రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని