పండుగకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తోందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24వ

Published : 20 Oct 2020 01:08 IST

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తోందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. జంట నగరాల్లోని ముఖ్యమైన అన్ని బస్ స్టేషన్ల నుంచి బస్సులను నడిపిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సుల అడ్వాన్స్ రిజర్వేషన్ సైతం సౌకర్యం కల్పించామన్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనంగా 281 బస్సులను నడిపిస్తున్నామన్నారు. 22 నుంచి 24 వరకు 2,034 బస్సులను నడపనున్నట్లు ఆర్ఎం వెల్లడించారు. 22న 657 అదనపు బస్సులు, 23న 659 బస్సులు, 24న 614 అదనంగా బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ వంటి ప్రధాన బస్‌ స్టేషన్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్‌ స్టాప్‌ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని ఆయన అన్నారు. నగర శివార్లలో నివసించే వారికోసం ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. 22 నుంచి 24 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, www.tsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వివరించారు. జేబీఎస్‌ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు; ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబ్ నగర్, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లే బస్సులను నడిపించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని