జోగులాంబలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా తుంగభద్రపుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువులు మాధవానందస్వామి, కమాలానందభారతి స్వామీజీ పుష్కరాలు ప్రారంభించారు. ఈ పుష్కరాల్లో...

Updated : 20 Nov 2020 17:38 IST

జోగులాంబ: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా తుంగభద్రపుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువులు మాధవానందస్వామి, కమాలానందభారతి స్వామీజీ పుష్కరాలు ప్రారంభించారు. ఈ పుష్కరాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్‌, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్‌లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల పిండ ప్రదానాలు, ప్రత్యేక పూజలకు మాత్రమే అనుమతిచ్చారు. కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు చూపిస్తేనే ఘాట్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. రిపోర్టు లేనివారికి పుష్కర ఘాట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే ఘాట్లలోకి అనుమతిస్తున్నారు.ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని