వైరాలజిస్టు ఖాతాను తొలగించిన ట్విటర్
కరోనా వైరస్ పుట్టుక గురించి చైనా నిజాలు దాస్తోందంటూ గొంతెత్తిన వైరాలజిస్టు ఖాతాను ట్విటర్ తొలగించింది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ ల్యాబ్ నుంచే బయటికి వచ్చిందని చైనాకు చెందిన వైరాలజిస్టు లీ
వుహాన్‌లోని ఓ పాఠశాల
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ పుట్టుక నిజాలు చైనా దాస్తోందంటూ గొంతెత్తిన వైరాలజిస్టు ఖాతాను ట్విటర్ తొలగించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన ఓ ల్యాబ్ నుంచే వైరస్ బయటికి వచ్చిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు లీ మెంగ్ యాన్ ఆరోపించారు. వైరస్ చైనాలోనే పుట్టిందనడానికి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. వైరస్ గురించి తాను ముందే హెచ్చరించినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ, చైనా ఉన్నతాధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అధికారుల బెదిరింపుల వల్ల తాను అమెరికాకు పారిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆమె ట్విటర్లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. అయితే, తాజాగా ట్విటర్ ఆమె ఖాతాను తొలగించింది. నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ఆమె ఖాతాను తొలగించినట్లు ట్విటర్ పేర్కొంది. తన ఖాతా తొలగింపుపై ఆ వైరాలజిస్టు స్పందించారు. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే తన ఖాతాను తొలగించారని ఆమె ఓ టీవీ షోలో పేర్కొన్నారు.
కరోనా వైరస్‌పై పరిశోధన చేశానని యాన్ చెప్తుండగా.. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్య కాలంలో తమ యూనివర్సిటీలో కరోనా వైరస్‌పై సదరు వైరాలజిస్టు ఎటువంటి పరిశోధనలు చేయలేదని హాంకాంగ్ యూనివర్సిటీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు