మీటూ: ‘శక్తిమాన్‌’ వివాదాస్పద వ్యాఖ్యలు

‘శక్తిమాన్‌’గా భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ముఖేశ్‌ ఖన్నా. తనదైన నటనతో యావత్‌దేశ ప్రజల మనసు దోచుకున్నారు. అయితే, తాజాగా

Published : 31 Oct 2020 22:08 IST

ముంబయి: ‘శక్తిమాన్‌’గా భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ముఖేశ్‌ ఖన్నా. తనదైన నటనతో యావత్‌దేశ ప్రజల మనసు దోచుకున్నారు. అయితే, తాజాగా మహిళలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమాన్ని ఉద్దేశించిన ముఖేశ్‌ మహిళలను అగౌరవపరిచేలా, చులకనగా మాట్లాడంతో ఈ వివాదం రాజుకుంది.

ముఖేశ్‌ ఏమన్నారంటే..

మీటూ ఉద్యమంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మహిళలకు చక్కగా సరిపోయే ఉద్యోగం ఇంటి పని చేసుకోవడమే. దాన్ని వదిలేసి బయటకు వచ్చి పురుషులతో సమానంగా పనిచేయడం వల్లే ఈ ‘మీటూ’వంటివి మొదలయ్యాయి’’ అంటూ ఓ వీడియోలో వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ముఖేశ్‌ ఖన్నా స్త్రీ ద్వేషి’ అంటూ ఆరోపించారు. ‘ఈ ఒక్క మాటతో ముఖేశ్‌ గతంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు గంగపాలైపోయాయి. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించ పరిచేలా ఉన్నాయి. ఆయనొక స్త్రీ ద్వేషిలా ఉన్నారు. ఆయనకు ప్రచారం కల్పించడాన్ని మీడియా ఇకనైనా ఆపేయాలి’ అని ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డారు. ‘చిన్నతనంలో ఇతన్ని చూశా..  మన మార్గదర్శి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని