IAS officer: కూరగాయలు అమ్మిన ఐఏఎస్‌ ఫొటో వైరల్‌.. అసలు కథ ఇదీ!

ఓ ఐఏఎస్‌ అధికారి కూరగాయలు అమ్మే వ్యక్తి అవతారమెత్తారు. ఇంతకీ కథేంటంటే?..

Published : 28 Aug 2021 10:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌: ఓ ఐఏఎస్‌ అధికారి కూరగాయలు అమ్మే వ్యక్తి అవతారమెత్తారు. ఇంతకీ కథేంటంటే?.. ఉత్తర్‌ప్రదేశ్‌ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అఖిలేశ్‌ మిశ్ర. రోడ్డు పక్కన ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి తన ఫేస్‌బుక్‌ పేజీలో కనిపించింది. దీంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఐఏఎస్‌ ఏంటి.. కూరగాయలు అమ్మడమేంటి? అని నెటిజన్లు షాకయ్యారు. ఈ వ్యవహారంపై అఖిలేశ్‌ మిశ్ర స్పందించారు. ఫొటో నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మడం వాస్తవం కాదని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కూరగాయల కోసం దిగాను. ఆ సమయంలో కూరగాయలు అమ్మే ఆవిడ.. తన తన పిల్లాడు ఎటో వెళ్లాడని, తన కోసం చూసి వస్తా అని చెప్పి.. నన్ను తన దుకాణాన్ని కాసేపు చూస్తూ ఉండమని చెప్పింది. దీంతో అక్కడే కూర్చున్నా. ఈ లోపే కొందరు అక్కడికి కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్‌బుక్‌లో పెట్టారు’’ అని అఖిలేశ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని