వందేభారత్‌ ద్వారా 39 లక్షల మంది స్వదేశానికి..

ఈ ఏడాది మేలో వందేభారత్‌ మిషన్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 39లక్షల మందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తెలిపారు.

Published : 20 Dec 2020 01:41 IST

దిల్లీ: ఈ ఏడాది మేలో వందేభారత్‌ మిషన్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 39లక్షల మందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందేభారత్‌మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. డిసెంబరు 18 శుక్రవారం నాడు 8,546 మంది భారత్‌కు వచ్చినట్లు మంత్రి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 1 నుంచి ఈ మిషన్‌ ఫేజ్‌-8 ప్రారంభించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ తెలిపారు. దీనిలో భాగంగా లక్షాయాభైవేల మందిని స్వదేశానికి రప్పించనున్నట్లు వారు తెలిపారు. మే 25 నుంచి భారత్‌లో దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్రం అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగించింది. ఈ నెల 31వరకూ వాటిపై నిషేధం ఉంటుందని వారు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రభుత్వం నిలిపేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని