శాంతి స్థాపనతోనే దేశ ప్రగతి: ఉపరాష్ట్రపతి

ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉన్న దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా నిలుస్తుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 21 Sep 2020 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉన్న దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా నిలుస్తుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన శాంతి ద్వారానే దేశప్రగతి సాధ్యమవుతుందన్నారు. మహాత్మాగాంధీ ప్రవచించిన శాంతి, అహింసా మార్గం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిని పంచిందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతీయులందరూ శాంతి కాముకులన్న ఆయన విశ్వమంతా ఒకే కుటుంబమనే భావన భారతీయుల జీవననాదమని తెలిపారు. సర్వేజనా సుఖినోభవంతు అనే భారతీయ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేద్దామని  పిలుపునిచ్చారు. అభివృద్ధికి బాటలు వేసే ప్రపంచ శాంతి స్థాపనకు ప్రతిఒక్కరూ పునరంకితమవాలని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని