
శ్రీగాయత్రి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజున కనకదుర్గమ్మ శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి నగను బహూకరించిన ఎన్నారై
ఏడువారాల వజ్రాల నగను విజయవాడకు చెందిన ఎన్నారై తాతినేని శ్రీనివాస్ దుర్గమ్మకు కానుకగా సమర్పించారు. ఈ మేరకు దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుకు శ్రీనివాస్ కుటుంబం ఈ నగను అందించింది. ప్రతి గురువారం అమ్మవారికి ఈ నగను అలంకరించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు.
.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.