సింహం.. తీసే కూనిరాగం..

ఓ మృగరాజు కూడా గొంతు సవరించుకుందని అమెరికాలోని బ్రాంక్స్‌ జూ యాజమాన్యం అంటోంది.

Published : 14 Dec 2020 07:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సంబరాలు చేసుకునేందుకు ప్రపంచమంతా సిద్ధమౌతోంది. ఈ వేడుకల్లో  భక్తి గీతాల ఆలాపన కూడా ముఖ్య భాగం. ఈ నేపథ్యంలో నెటిజన్లు  భక్తి గీతాలను ఆలపించి, వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుండగా.. ఆ గీతాలు నెట్టింటిని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తానేం తక్కువ తినలేదన్నట్టు ఓ మృగరాజు కూడా గొంతు సవరించుకుందని అమెరికాలోని బ్రాంక్స్‌ జూ యాజమాన్యం అంటోంది. అనడమే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.

‘‘సింహాలు కూడా పాడతాయని మీకు తెలుసా?ఇప్పుడు మీరు వింటున్న శబ్దం సింహాలు ఒకదానితో ఒకటి సంభాషించుకునే విధానాల్లో ఒకటి. ఇక వాటి గర్జన సుమారు 5 మైళ్ల వరకు వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. చూడబోతే ఇది పండుగ సంబరాలకు తయారౌతున్నట్టుంది!’’ అనే వ్యాఖ్యను ఆ వీడియోకు జతచేసింది. మరి సింహరాజు గానం ఎలా ఉందో వినాలంటే మీరు ఈ వీడియోను చూడాల్సిందే!

ఇవీ చూడండి..

శ్వేతసౌధంలో క్రిస్మస్‌.. ట్రైలర్‌ చూస్తారా!

 సొరచేప, మొసలి ఎదురుపడితే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని