గోదావరికి మళ్లీ పెరిగిన ఉద్ధృతి

శాంతించినట్లే కనిపించిన గోదావరికి వరద మళ్లీ పోటెత్తుతోంది. ప్రాణహితకు ప్రవాహ ఉద్ధృతితో కాళేశ్వరం బ్యారీజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ..

Published : 02 Sep 2020 12:22 IST

భద్రాచలం: శాంతించినట్లే కనిపించిన గోదావరికి వరద మళ్లీ పోటెత్తుతోంది. ప్రాణహితకు ప్రవాహ ఉద్ధృతితో కాళేశ్వరం బ్యారీజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్‌ వద్ద 12.27 మీటర్ల మేర ప్రవాహం ఉంది. మొదటి స్థాయి ప్రమాద హెచ్చరిక దాటి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. భారీ వరదతో కాళేశ్వరం వద్ద పూజలు, పుణ్యస్నానాలు నిలిపివేశారు. తీర ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని